Latest News

Menu

Trending News

Previous
Next

Latest Post

Articles

Special Features

Latest Reviews

Videos

Shortfilms

Poetry

Recent Posts

పోలవరం: చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యం.. జగన్ పాలనలో పరుగు!

Tuesday, 3 November 2020 / No Commentsఏపీ కలల ప్రాజెక్ట్ పోలవరం. దీన్ని పూర్తి ఏపీ సగం జనాభాకు సాగు, తాగునీటి సమస్యలు ఉండవు. సీమకు పారించి సస్యశ్యామలం చేసేంత వరద నీటి సామర్థ్యం దీని సొంతం. దశాబ్ధాలుగా ఈ ప్రాజెక్ట్ పూర్తికావాలన్నది ప్రజల చిరకాల వాంచ. దీన్ని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించగా.. ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. మధ్యలో వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దీన్నొక ఏటీఎంలా వాడేశాడన్న అపవాదును మూటగట్టుకున్నాడు.

అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా ఏకంగా అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కి అసెంబ్లీలో చాలెంజ్ చేశాడు. పోలవరం పూర్తి చేస్తాం అని తొడగొట్టాడు. కానీ చేయలేకపోయాడు.  అధికారంలోకి వచ్చాక జగన్ దాన్ని పూర్తి చేయడం విశేషం.  మొన్నటి ఎన్నికల వేళ దేశ ప్రధాని మోడీ తనకు తానుగా టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం పోలవరంను ఏటీఎంలా వాడేసిందని ఆరోపించాడు. చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేవి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చాక.. పోలవరం పనులు మేఘా చేపట్టాక వాయువేగంతో పనులు నడుస్తున్నాయి. కరోనా వచ్చినా.. వరదలు ముంచెత్తినా పనులు మాత్రం ఆగకుండా కమిట్ మెంట్ తో సాగుతున్నాయి. రాత్రి పూట కూడా పనులు జరుగుతుండడం విశేషంగా చెప్పవచ్చు. అత్యంత ఆధునిక, సాంకేతికపరిజ్ఞానంతో నడిచే యూనిక్యూ మెషీన్లను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మేఘా సంస్థ వాడుతూ పూర్తి చేస్తోంది. డెడ్ లైన్ లోపల ప్రాజెక్ట్ పూర్తి చేయాలని పట్టుదలతో ముందుకెళుతోంది.

పోలవరం పనులను చంద్రబాబు సర్కార నత్తకు నడకనేర్పేలా చేస్తే.. ఇప్పుడు జగన్ ప్రాజెక్ట్ చిరుత వేగంతో పూర్తి చేస్తోంది. ఈ ఇద్దరి పాలనకు పోలవరం పనుల పూర్తే మచ్చుతునక అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. నక్కకు నాగలోకానికి అంత తేడా ఉందని అంటున్నారు.

మేఘా ఇంజనీరింగ్ సంస్ద ఈ సంవత్సర కాలంలో స్పిల్ వేను శరవేగంతో పూర్తి చేస్తోంది. మేఘా చేపట్టక ముందు ఆనాడు పియర్స్ ఎత్తు సరాసరి 28 మీటర్లు ఉంటే.. ఇప్పుడు 52 మీటర్లు కు నిర్మాణం పూర్తి కావడం విశేషంగా చెప్పొచ్చు.  ఇప్పటికే 171 గడ్డర్లు నిర్మాణం పూర్తి అయ్యింది.  గడ్డర్లు నిర్మాణం పూర్తి అవ్వడమే కాకుండా దాదాపు 84 గడ్డర్లును  స్పిల్ వే పియర్స్ పై పెట్టి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించింది.. 10పియర్స్ పై బ్రిడ్జి శ్లాబు నిర్మాణం దాదాపు 250మీటర్లు పూర్తి అయ్యింది.  మిగతా పియర్స్ మీద గడ్డర్ల ఏర్పాటుతో పాటు,షట్టరింగ్ వర్క్, స్టీల్ అమరిక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.   గేట్లు ఏర్పాటులో కీలకమైన ట్రూనియన్ భీంల నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.  ఇప్పటికే 20 ట్రూనియన్ భీంల నిర్మాణం పూర్తయ్యింది. పూర్తి అయిన ట్రూనియన్ భీంల దగ్గర గేట్లు ఏర్పాటుకు సంబందించిన ప్రిలిమినరీ పనులు జరుగుతున్నాయి.

స్పిల్ వే లో ఇప్పటి వరకు 1,94,944 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.  స్పిల్ ఛానెల్ లో 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని,10,64,417 క్యూబిక్ మీటర్లు మట్టితవ్వకం పనులు ఇప్పటివరకు పూర్తయ్యాయి. జూన్ నుండి స్పిల్ ఛానెల్ లోకి వరద నీరు రావటంతో పనులు నిలిచిపోయాయి. వరద నీరు తోడటం ప్రారంభించి త్వరలోనే మట్టి తవ్వకం పనులు,కాంక్రీట్ పనులు ప్రారంభించనున్నారు.  ఈ సీజన్ లో పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు.

గ్యాప్-1 ఢయా ఫ్రంవాల్ నిర్మాణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. 2కాలమ్స్ నిర్మాణ పనులు కూడా పూర్తి అయ్యాయి.  గ్యాప్-3లో మట్టి తవ్వకం పనులు,కొండ రాయి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి.  కీలకమైన 902కొండ తవ్వకం పనులను 1,88,623 క్యూబిక్  మీటర్లు పూర్తి అయ్యాయి.  వరదల వల్ల పాడైపోయిన ఎగువ కాఫర్ ఢ్యాం నిర్మాణ పనులును సైతం వేగం చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.

ఇలా ఇంతటి కరోనా కరువు కాలంలో.. గోదావరి ఉగ్రరూపంతో పొంగుతున్న సమయంలోనూ ఏపీ ప్రభుత్వం, మేఘా సంస్థ పోలవరంను పరుగులు పెట్టిస్తుండడం విశేషంగా మారింది. గడువులోపు పూర్తి చేసి తరతరాల నిర్లక్ష్యానికి చెక్ పెట్టాలని యోచిస్తున్నాయి. జగన్ పట్టుదల.. మేఘా పనితనంతో ఏపీ ప్రజల చిరకాల వాంచ, కలల ప్రాజెక్ట్ పూర్తి అవుతోంది. నవ్విన నాపచేనే పండు అన్నట్టుగా టీడీపీ ఏ నోటితోనైతే విమర్శలు గుప్పించారో ఇప్పుడు అదే నోటితో పొగడాల్సిన రోజు రాబోతోంది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి రెడీ అవుతోంది.

MEIL road connects Southern and Northern India

Friday, 16 October 2020 / No Comments

 MEIL road connects Southern and Northern IndiaMegha Engineering and Infrastructure Limited (MEIL) is connecting regions by building many prestigious projects of international standards in country and abroad also. It is been a major part in the development of infrastructure. MEIL has now taken up two key roads project in Andhra Pradesh which will connect Southern and Northern parts of India. This two roads will reduce the travel distance and time along with fuel consumption will also saved. 

On Friday, Union Minister for Road Transport and Highways Nitin Gadkari virtually laid foundation stone for two road construction projects. Chief Minister of Andhra Pradesh Y.S. Jagan Mohan Reddy presided over the program. Several Central, State Ministers, Prominent and Officials participated in this program. 

As part of NH-16 a 30 KM long 6 lane by-pass road is been constructed by MEIL from Chinna Avutapalli to Gollapudi. This by-pass will reduce distance between Hyderabad – Kolkatta - Chennai. Previously vehicles from Hyderabad and Kolkata travelling to Chennai had to go via Vijayawada town. After the completion of this by-pass road vehicles from Hyderabad and Kolkata can go directly to Chennai. This will ease transportation and also save time and fuel.

Another road construction by MEIL is NH-71 between Nayudupeta and Renigunta route. Presently this route is by lane road. Due heavy vehicle movement frequent traffic jams arise causing severe problems to travelers on this road. 

MEIL is constructing 57 KM long 6 lane road which makes travelling to holy place Tirumala more convenient and also travelling towards Chennai, Bengalore, Renigunta Airport and Srikalahast Temple will be very much eased. As part of NH project MEIL is also constructing by-pass on Nayudupeta, Renigunta, Srikalahasti and Yerpedu route.

On this occasion Union Minister Nitin Gadkari said that roads play very important role in the development of the region. Andhra Pradesh is giving helping hand in the development of the infrastructure. Pending NH issues will also be discussed with Chief Minister and will carry accordingly. If any obstacles are there we will discuss and complete the projects. And also should take all necessary precautions to restrict road accidents. 

Speaking on this occasion Chief Minister Y.S. Jagan Mohan Reddy said that Centre should support AP in the road network development projects. Already several projects are in process and are pending at Centre. Requested Central Minister to take necessary action and clear the pending projects works. AP government is taking all steps for the development of the infrastructure.

Asia’s Longest bi-directional Road Zojila Tunnel Project

Thursday, 15 October 2020 / No Comments

Asia’s Longest bi-directional Road Zojila Tunnel Project initially started its work on 15th October. Union Minister of Road Transport & Highways Nitin Gadkari initiated the work with First Blast on virtual mode. The tunnel is one of the longest in Asia with a length of 14.15 KM built situated at an altitude of 11,575 feet and provides yearlong connectivity in the valley. 

The valley gets disconnect for nearly 6 to 7 months from other parts of India. Essential services get disrupted.  This tunnel connects Srinagar and Leh via Drass and Kargil. Besides Tunnel, MEIL is constructing 18.63 KM approach road parallel to it. This tunnel on NH-1 will reduce the journey time between Baltal and Matian to just 15 minutes from the present 3.5 hours. 

This tunnel is equipped with the advanced technology with European standard safety measures. CC TV monitor, continuous electricity supply, Traffic logging equipments internal lightning system, emergency telephone and radio system, over height vehicle control, Automatic fire detectors, Fire alarm buttons, centralized control room, lay – bye roads and other safety measures are installed. In this tunnel, maximum speed travel would 80 kmh. 

Zojila tunnel will make a new beginning for Indian Army and local people of the region. It gives boost to economic and cultural aspects in Leh and Kargil region. Union Minister Nitin Gadkari commended MEIL’s efficiency in completing its tasks in timely manner and requested to complete the project in span of four years. He applauded MEIL MD as a young entrepreneur and praised his efforts in giving employment to the local people of Ladakh and Kashmir.

హైదరాబాద్ బుట్టా బొమ్మా బిగ్‌బాస్‌లోకి ప్రవేశించింది

Saturday, 26 September 2020 / No Comments

 ఇంట్రెస్టింగ్స్ టాస్క్ లతో ప్రేక్షకాభిమానం‌ పొందుతోన్న 

బిగ్‌బాస్4  షోలో మరో కీలకమార్పు చోటు చెసుకొనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఓ వైపు ఐపీఎల్ జరుగుతున్నా క్రేజ్ తగ్గించుకోకుండా దూసుకుపోతున్న బిగ్‌బాస్ మరింత ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది.గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చేసింది. ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తెలుగమ్మాయి అయిన హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4వ సీజన్ లోకి వెల్కమ్ చెప్పింది.


చిచ్చుపెట్టడం, చెదరగొట్టడం బిగ్ బాస్ స్టైల్. వీటి కోసమే సెపరేట్ టాస్క్ లు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు వచ్చే కొత్త హీరోయిన్ తో షోలో వేడెక్కించడంతో పాటు హౌజ్ కు మరింత గ్లామర్ జోడించనున్నారు స్వాతి దీక్షిత్.


రెండేళ్ల క్రితమే స్వాతికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినా, ఈ సీజన్ కు తన ఎంట్రీ అవసరం ఉందని స్వాతి డిసైడ్ అయింది.‌ నటిగా ఇప్పటికే బెంగాలీ,తమిళ ,తెలుగు సినిమాలతో అలరించిన స్వాతి, హౌస్ మేట్ గా బిగ్ బాస్ లో అదరగొట్టెందుకు సిద్దమంటొంది‌ . నిజానికి ఆర్.ఎక్స్100 సినిమాలో తొలుత స్వాతి నే హీరోయిన్. వారంపాటు  షూటింగ్  చేసిన తర్వాత, ఆ బోల్డ్ రోల్ , తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గది కాదనీ ,సినిమా నుంచి తప్పుకుంది. పర్సనల్ గా స్వాతి నటిగా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనె‌ తండ్రిని కోల్పొయింది. ఆ బాధ ను తట్టుకుని ,మరొపక్క  కుటుంబ భాద్యతలను కూడా తనపై వేసుకుని ,తనకంటూ ఓ ఐడెంటిటిని క్రియేట్ చెసుకునెందుకు స్వాతి సిద్దమయింది.


 ఇక తెలుగు ప్రేక్షకుల ఆదరణ ,ఓ తెలుగుమ్మాయిగా తనకు ఉంటుందని ఆశిస్తూ.. తనవంతుగా దిబెస్ట్ కంటెస్టెంట్ గా ఈ రియాలిటీ షోలో గుర్తింపు తెచ్చుకుంటానంటొంది గ్లామరస్ స్వాతి దీక్షిత్...

జగన్ 5 ఏళ్ల టార్గెట్ ఫిక్స్ డ్.. సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్ష్య కోట్లు ఖర్చు

Saturday, 19 September 2020 / No Comments

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది పాలనలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసమే ఏపీ సర్కార్ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరోవైపు ఏపీ ప్రజలకు శాశ్వతంగా లబ్ధి చేకూరేలా జల ప్రాజెక్టులను చేపడుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి  మొదలుపెట్టిన ‘జలయజ్ఞాన్ని’ వైఎస్ జగన్ ఏపీలో ఐదేళ్లలోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

* ప్రాజెక్టుల నిర్మాణంపై ముందుకే..

ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల వల్ల రైతాంగంతోపాటు ప్రతీఒక్కరికి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నింటిని తన హయాంలోనే పూర్తి చేయాలనే సంకల్పంతో వైఎస్ జగన్ ముందుకెళుతున్నాడు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయడంతోపాటు కొత్తవాటి కోసం మొత్తం ఐదేళ్లలో కనీసం రూ.96,550కోట్లు వ్యయం చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వాటికోసం రూ. 84,092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.72,458 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళిలలు వేసుకుంది. ఈ నిధులు సమీకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ఎస్పీవీలు (స్సెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేస్తోంది.

* శరవేగంగా పనులు..

ఏపీలో పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ ఈ ప్రాజెక్టు పనులను ప్రతిష్టాత్మంగా తీసుకొని పూర్తి చేస్తోంది. ఇప్పటిదాకా మొత్తం ప్రాజెక్టు పనుల్లో 71.46శాతం పనులు పూర్తి కాగా ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కీలకమైనవి. గత ఆరునెలల కాలంలో 2.80 లక్షల ఘనపు మీటర్ల స్పిల్ వే కాంక్రీట్, స్పిల్ వే ఛానెల్ పనులు జరిగాయి. అదే సమయంలో స్పిల్ ఛానెల్, పవర్ హౌజు, గ్యాప్-1,2,3 లకు సంబంధించిన మట్టి, రాతికట్టి, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి.

* వరదల్లోనూ ఆగని పనులు..

ప్రస్తుతం గోదావరికీ వరదలు ఉన్నప్పటికీ  పనులు ఆగకుండా  స్పిల్ వే కాంక్రీట్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులను కొనసాగిస్తున్నారు. వరద తగ్గిన తరువాత అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలతో పాటు స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్లను గ్యాప్-1,2,3 పనులను అధికారులు చేపడుతున్నారు. వీటితోపాటు రాష్ట్రంలో గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రకాల ప్రాధాన్యతలను నిర్ణయించారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది కొన్ని ప్రాజెక్టులను వినియోగంలోకి తెచ్చేందుకు బడ్జెట్లు కేటాయించగా ఇతర ప్రాజెక్ట్ లను మూడు నుంచి నాలుగేళ్ళ సమయంలో పూర్తి చేయడానికి లక్షాలను నిర్దేశించారు.

* నిధులకు ఆటంకం కలుగకుండా ఎస్పీవీ ఏర్పాటు..

రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరత ప్రధాన అవరోధంగా మారుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎస్పీవిలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అందులో ఎస్పీవి-1 కింద రాయలసీమలో కరువు నివారణకు రూ.39,980కోట్లు ఐదేళ్ళలో ఖర్చు చేయనున్నారు. ఎస్పీవి-2 కింద ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్ లు పూర్తిచేయడానికి ఐదేళ్ళలో రూ.8,787కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎస్సీవి-3 కింద ఏపీ రాష్ట్ర నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమం పేరుతో రూ.12,702 కోట్లు ఐదేళ్లలో సమీకరించనున్నారు. ఎస్పీవి-4 పేరుతో పలనాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి, కృష్ణా-పెన్నాల అనుసంధానం కోసం రూ.7,636 కోట్లు, ఎస్పీవి-5 క్రింద కృష్ణా - కొల్లేరు సెలినిటి మిటిగేషన్ కార్యక్రమం ద్వారా రూ.3,356 కోట్లు సమీకరించనున్నారు.

* ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..

పెండింగ్ లోని సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కార్ ప్రాధాన్యతను గుర్తించి పరుగులు పెట్టిస్తోంది. వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తుంది. ఇటీవలే సీఎం జగన్‌ పోలవరం, ఉత్తరాంధ్రతోపాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోచేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

*పరిహారం పెంపుపై రైతులకు అవగాహన..

ఈ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం-2, పూల సుబ్బయ్య వెలిగొండ-హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు, వంశధార-నాగావళి లింక్, బీఆర్ఆర్‌ వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం కాకుండా పనులు పరుగులు పెట్టించాలన్నారు. చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23టీఎంసీల నీరు నిల్వ చేయాలని, వెంటనే ఆర్అండ్ఆర్‌ ప్యాకేజీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75లక్షల పరిహారం ఇస్తే ప్రస్తుతం రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.


* ప్రణాళికతో ముందుకెళుతున్న ప్రభుత్వం..

నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలకు సంబంధించి 71శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ అధికారులు పనులు చేస్తున్నారు.

* ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి..

వంశధార-నాగావళి అనుసంధానం పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. మొత్తం 33.5కి.మీకు గానూ ఇంకా 8.5కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం పని చేస్తోంది. వంశధార స్టేజ్‌-2 సంబంధించి రెండోదశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో చర్చించాల్సి ఉంది. 

* సాగునీటి ప్రాజెక్టులతో ఏపీ సస్యశ్యామలం..

శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ కోసం 850 కోట్లు వ్యయం ఖర్చు చేయనున్నారు. తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నారు. వీటితోపాటు ఉత్తరాంధ్రలోని పెండింగ్, కొత్త ప్రాజెక్టులను ఐదేళ్లలోనే పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. 

జగన్ స్పీడు చూస్తుంటే అనుకున్న సమయానికి కంటే ముందుగానే ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే ఏపీ  సాగునీటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం కావడం ఖాయంగా కన్పిస్తోంది

సరిహద్దుల్లో సాహసం.. ప్రతిష్టాత్మకమైన జోజిల్లా పాస్ రోడ్ టన్నెల్ పని దక్కించుకున్న మేఘా

Friday, 21 August 2020 / No Comments

రక్షణలో కీలకమైన ప్రాజెక్టు మేఘా చేతికి చిక్కంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జోజిల్లా పాస్ టెన్నల్ ప్రాజెక్టు పనులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ ( ఎంఈఐఎల్) దక్కించుకుంది. హిమాలయాల్లోని జమ్ము కాశ్మీర్-లడఖ్ లో అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నిర్మించనున్న జోజిల్లా పాస్ టన్నెల్ పనులకు సంబంధించిన టెండర్ అతి తక్కువ ధరకు ఎంఈఐఎల్ కోట్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జాతీయ రహదారులు, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ హెచ్ఐడీసీఎల్(NHIDCL) ఫైనాన్స్ బిడ్లను తెరవగా అతితక్కువ కోట్ చేసి ఎంఈఐఎల్ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది.

* క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాణానికి సిద్ధం..

ఇందులో భాగంగా మొత్తంగా దాదాపు 33కిలోమీటర్ల మేర రెండు విభాగాలుగా రోడ్డ పనులు చేపట్టాల్సి ఉంటుంది. మొదటి విభాగంలో 18.50కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేసి నిర్మించాలి. ఇందులో రెండు టన్నెల్స్ ఉన్నాయి. మొదటిది రెండు కి.మీ. మరియు రెండవది 0.5 కి.మీ. ఇక రెండవ విభాగంలో జోజిల్లా టన్నెల్ ను 14.15 కిలోమీటర్ల మేర రెండు రహదారుల లైన్ గా 9.5మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు పద్ధతిలో గుర్రపు నాడా(Horse shoe shape) ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుంది.


*అత్యంత తక్కువ ధరకు కోట్..

సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఈ రోడ్ టన్నెల్ కు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకుల టెండర్లను పిలిచింది. ఇందులో జోజిల్లా టన్నెల్ కు సంబంధించి 14.15కిలోమీటర్ల రహదారిని నిర్మించేందుకు, ఇతర రోడ్ పనులకుగాను వేరే సంస్థలు అధిక ధరలకు కోట్ చేశాయి. అయితే ఎంఈఐఎల్ 4509.50 కోట్ల రూపాయలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే ఎంఈఐఎల్ అతి తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా ఎల్-1 ముందంజలో నిలిచింది. గతనెల 30వ తేదిన NHIDCL మూడు సంస్థలు బిడ్ లు సమర్పించగా ఆగస్టు 21 న ఫైనాన్స్ బిడ్లు తెరిచారు.


*సవాల్ కు సిద్ధమైన మేఘా..

దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసిన మేఘా(ఎంఈఐఎల్) కు ఉంది. ఎన్నో క్లిషపరిస్థితులను ఎదుర్కొంటూ సమయానికి పనులు పూర్తి చేయడంలో మేఘా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా మరో సవాల్ కు సిద్ధమవుతుంది. జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండవు. హిమాలయాల్లో ముఖ్యంగా శీతాకాలంతో పాటు మొత్తం ఆరు నెలలపాటు శ్రీనగర్-లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీకి సంబంధించిన వాహనాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృథా అవుతోంది. ఈ పరిస్థితుల్లో సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్ కు రహదారి టన్నెల్ నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు. అయితే అది ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది.


* ఎతైన ప్రాంతంలో పనులు సులభం కాదు..

జాతీయ రహదారి-1లోని జడ్-మోర్హ (Z-Morh) టన్నెల్ నుంచి జోజిల్లా టన్నెల్ వరకు కనెక్టింగ్ టన్నెల్ ను జోజిల్లా పాస్ ప్రాంతంలో సోనామార్గ్- కార్గిల్ మధ్య ఎంఈఐఎల్ నిర్మించనుంది. ఈపీసీ పద్ధతిలో చేపడుతున్నప్పటికీ ఈ పని అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఏ రహదారి టన్నెల్ నిర్మాణంలో ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకానున్నాయి. సరాసరిన భూ ఉపరితలం నుంచి 700మీటర్ల దిగువన టన్నెల్ ను నిర్మించాల్సి ఉంటుంది. పూర్తిగా క్లిష్టమైన కొండప్రాంతం(complicated hilly terrain)  తోపాటు మంచు తుఫాన్ లు తరచూ సంభవిస్తుంటాయి. దట్టమైన మంచు సంవత్సరంలో 8నెలలపాటు ఉండడం వల్ల పనులు చేయడం అంత సులభం కాదని తెలుస్తోంది. అదే సమయంలో పక్కనే నది కూడా ప్రవహిస్తుంది. దీనివల్ల నిర్మాణ సమయంలో నీరు, మంచు ప్రవేశించి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని నిపుణులు భావిస్తున్నారు.


* సరిహద్దుల్లో రవాణా మెరుగు..

సరిహద్దు రహదారులు సంస్థ  జమ్ము కాశ్మీర్- లడఖ్ మధ్య అన్ని వర్గాల వారికి రహదారి ప్రయాణ సౌకర్యాలు మెరుగు పరచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే హైవే టన్నెల్ ను శ్రీ నగర్ నుంచి బల్తల్ వరకు కూడా నిర్మించాలి. అమరనాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఈ టన్నెల్ రహదారి వాడవచ్చు. ఈ యాత్రకు వెళ్లే వారికి కార్గిల్ సమీపంలోని బల్తల్ బేస్ క్యాంప్ గా ఉంది.


* క్లిష్ట పరిస్థితుల్లో 72నెలలపాటు పనులు..

సింగిల్ ట్యూబ్ టన్నెల్ గా పిలిచే ఈ జోజిల్ల రహదారిలో రెండు వైపులా ప్రయాణించే (బై డైరెక్షనల్ ట్రాఫిక్) రెండు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సీహెచ్. సుబ్బయ్య తెలిపారు. ఈ రహదారిలో ప్రధానంగా  శాప్ట్స్ తో పాటు పోర్టల్ స్ర్టక్చర్స్, తవ్విన మట్టిరాయి (మక్కు) డిసోపోసబుల్ ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇంతటి క్లిష్టమైన ప్రాజెక్ట్ ను 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం పనిని ప్రధానంగా రెండు భాగాలుగా చేయాల్సి ఉంటుంది.


దీనిలో మొదటి భాగం రహదారి 18.50కిలోమీటర్లు, రెండవ భాగం టన్నెల్ గా 14.15 కిలోమీటర్లు. మొదటి భాగం జడ్ -మోర్హ నుంచి నుంచి జోజిల్లా టన్నెల్ వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని 3.018 కిలోమీటర్లు విస్తరించి అభివృద్ధి చేయాలి. కొత్తరహదారి 13.842 కిలోమీటర్లు నిర్మించాలి. ఇందులోనే ట్విన్ టూర్ టన్నెల్స్ ఒకటి 2.36 కిలోమీటర్లు, రెండవది 2.39కిలోమీటర్లు నిర్మించాలి. ఇందులో 5 బ్రిడ్జ్ లు ఉంటాయి. ఒక్కొక్కటి 300 మీటర్లు, 150 మీటర్ల చొప్పున రెండు స్నో గ్యాలరీలను నిర్మించాలి. ఈ పనులన్నీ మొత్తం 18.475 కిలోమీటర్లు. అదే విధంగా పార్ట్-2లోని జోజిల్లా టన్నెల్ నిర్మించాలి. ఇందులో టన్నెల్ కు సంబంధించి పైన పేర్కొన్న వివారాలతో పాటు 0.16 కిలోమీటర్ల పొడవున కట్ అండ్ కవర్ టన్నెల్ ఉంటుంది. వెంటిలేషన్ క్యావరిన్, శాఫ్ట్ల్ లు 3 నిర్మిస్తారు. లాంగ్ ట్యూడనల్ వెంటిలెషన్ సిస్టంగా పిలిచే శాఫ్ట్ లు రెండింటిని నిర్మిస్తారు.


*దేశ రక్షణలో ‘మేఘా’ సైతం..

దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టలేదని తెలుస్తోంది. తొలిసారి మేఘా ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఈ పనులు చేపడుతోంది. దీనిలో ప్రత్యేకంగా ట్రాన్స్ పోర్టు వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. వీటికి అదనంగా రిటైనింగ్ గోడలు, బ్రిస్ట్ గోడలు, గేబియన్ నిర్మాణాలు, మట్టితో నిర్మించే గోడలు మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఎంఈఐఎల్ నిర్మించాల్సి ఉంటుందని సుబ్బయ్య తెలిపారు. మంచుతుఫాన్లు తలెత్తితే ఎటువంటి ప్రమాదం లేకుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ దాదాపు 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. మొత్తంమీద మేఘా సంస్థ దేశ రక్షణకు ఎదరవుతున్న మరో సవాల్ ను పూర్తి చేయడానికి సిద్ధమవుతుండటం విశేషం.

కృష్ణ జలాల వివాదాన్ని కేంద్రం అనుకూలంగా మార్చుకుంటుందా?

/ No Comments

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం ఎప్పటి నుంచి ప్రేక్షక పాత్ర పోషించడం నేటికి ఆ జలవివాదాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇరురాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన కేంద్రం సైతం రాజకీయాలకు పాల్పడుతూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న ఆవేదన రాజకీయవర్గాల్లో నెలకొంది. జలవివాదాన్ని పరిష్కరించకుండా ఒక ప్రాంతానికి అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నీటి సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారుతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి కంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాకే ఇరురాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు నెలకొన్నాయనేది వాస్తవం. ఈ సమయంలో కృష్ణా జలాల వివాదం ఇరురాష్ట్రాల సీఎంల మధ్య చిచ్చుకు కారణమవుతోంది. ఇరుప్రాంతాల ముఖ్యమంత్రులు తమ ప్రాంత ప్రయోజనాలకు కట్టుబడి ఉండటంతో జలవివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. అగ్నికి అజ్యం పోసినట్లుగా కేంద్రం ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు యత్నిస్తుండటం శోచనీయంగా మారింది.

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తాగునీటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అటూ తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటూ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సాగునీటికే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తున్నారు. ఇంకోవైపు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటిని తరలించి రాయలసీమలో కరువుఛాయలు దూరం చేసేందుకు భగీరథ యత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ ఇటీవలే అనుమతి కూడా ఇచ్చింది. రాయలసీమ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదని తేల్చిచెబుతూ ప్రాజెక్టు పనులకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే తెలంగాణ నుంచి వ్యతిరేక రావడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. తెలంగాణ కాంగ్రెస్ హైకోర్టుకెక్కింది.  ఇవన్నీ విచారణ జరగాల్సి ఉంది. ఈలోగా ఎన్జీటి ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ ప్రక్రియను ముగించింది.

ఈనేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో పట్టుకోసం వేచి చూస్తున్న బీజేపీకీ కృష్ణా జలాల వివాదం కలిసి వచ్చింది. దీనిని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. ఈనేపథ్యంలోనే కేంద్రం హడావుడిగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర మంత్రి అపెక్స్ కౌన్సిల్ కోవిడ్ సమయంలోనూ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడివారు అక్కడే ఈ సమావేశంలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించింది. 25న అపెక్స్ కమిటీ బాడీ సమావేశానికి ఇరు రాష్ట్రాల సీఎంలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందనే సందేహాలు కలుగుతున్నాయి.

ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాన్ని బీజేపీకి తనుకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తరువాత టిఆర్ఎస్ తో బిజెపికి సంబంధాలు పూర్తిగా బెడిసి కొట్టగా ఏపీలో అంతంత మాత్రంగా ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు ఉండటంతో ఈ వ్యవహారంలో తెలంగాణకు కేంద్రం అనుకూలంగా వ్యవహరించి లబ్ధిపొందేందుకు ప్లాన్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించవద్దని కేంద్రం ఆదేశించింది. ఈ వ్యవహరాన్ని కేంద్రం తన కనుసన్నల్లో ఉంచుకొని తెలంగాణలో బలపడేందుకు చూస్తోంది. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఆ ప్రాంతంలో లబ్ధి పొందేందుకు యత్నిస్తుందనే టాక్ విన్పిస్తోంది. ఇలా రాయలసీమకు నీళ్లు అందకుండా.. ఏపీకి న్యాయం కాకుండా బీజేపీ వ్యవహరిస్తుందనే అనుమానాలు ఏపీ ప్రజల్లో కలుగుతున్నాయి.  అయితే ఇద్దరు సీఎంలు ఇప్పటికే బీజేపీ వ్యూహాన్ని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అపెక్స్ బాడీ కమిటీలో ఇద్దరు సీఎంలు సామరస్యంగా సమస్యను పరిష్కరించేకునేందుకు సిద్ధం అవుతున్నారనే టాక్ విన్పిస్తోంది. దీంతో కృష్ణా జలాల వివాదంలో ఇద్దరు సీఎంలు కేంద్రానికి ఛాన్స్ ఇస్తారా? లేదా అన్నది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.