మధు షాలిని ప్రధాన పాత్ర లో "సీతావలోకనం"
తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రతిభ కు కొదవ లేదు. ఎంతో మంది ప్రతిభావంతులకు వేదిక గా నిలిచింది మన చిత్ర సీమ. చలన చిత్రం మీది మక్కువ తో, అపారమైన ప్రీతి తో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న వారు మాత్రం ఇక్కడ అరుదనే చెప్పాలి. అందరికంటే విభిన్నంగా ఆలోచిస్తూ వైవిధ్యమైన చిత్రాలను అందించాలనే తపన ఉన్న కొందరినే మనకు చిరకాలం గుర్తుండిపోయేలా చేస్తుంది. ఇటీవలి కాలం లో కొంత మంది చలన చిత్రాలకు ధీటుగా “ఇండిపెండెంట్ చిత్రాలను” తీస్తున్నారు. అలాంటి ఒక చిత్రం నేడు పరిశ్రమ లో ని అందరి దృష్టి ని ఆకర్షిస్తుంది.
ప్రముఖ కథానాయిక మధు షాలిని ప్రధాన పాత్ర లో నటిస్తున్న ఈ చిత్రం పేరు సీతావలోకనం. ఈ రోజు వరకు దర్శక నిర్మాతలు మధు షాలిని ని ఒక నేటి తరం అమ్మాయి గా, ఆధునికత పాత్రల లో నే చూపించారు కానీ ఆమెలో ఉన్న మరో కొత్త కోణాన్ని సీత పాత్ర ద్వారా మనకు ఆవిష్కరింప చేయనున్నారు దర్శకుడు మాదల వేణు. 2007 లో వేణు కలం నుండి జాలువారిన కథ ఈ సీతావలోకనం. అప్పటి ప్రభుత్వం ఈ కథ కు రాష్ట్ర యువజన పురస్కారాన్ని కూడా ప్రకటించడం గమనార్హం. ఆ కథ ఇప్పుడు తెరకెక్కనుండడం విశేషం.
పురాణ ఇతిహాసలకి సంబందించిన ఈ కథ లో సీత పాత్రను మధు షాలిని పోషిస్తుండగా, అనేక చిత్రాలలో తల్లి గా నటించిన ప్రగతి ఈ చిత్రం లో భూదేవి గా కనిపించనున్నారు. అలాగే ప్రముఖ నటి మీనా కుమారి ఈ చిత్రం లో అహల్య గా కనిపించనున్నారు. ఇటీవలే విడుదల అయిన మైనే ప్యార్ కియా చిత్రానికి పని చేసిన విశ్వేశ్వర్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకులు. సాహసం మరియు అందాల రాక్షసి చిత్రాలకు పని చేసిన రామకృష్ణ ఈ చిత్రానికి కళా దర్శకులు. ఇతిహాస నేపథ్యం గల ఈ కథకు అద్బుతమైన సెట్ లను నిర్మించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ కూర్పు నిర్వహించగా, రాజ కుమారి వస్త్రాలంకరణ విభాగం లో పని చేసారు. రమణ మాదల ఈ చిత్రానికి సహాయక బృందం లో పని చేసారు. ఈ చిత్రం యొక్క పోస్టర్స్ ని ధని ఏలే డిజైన్ చేసారు. సీతావలోకనం చిత్రానికి సంగీత దర్శకులు ఘంటసాల విశ్వనాధ్. ఈ చిత్రం లో రెండు పాటలు ఆయన స్వరపరిచారు. ఒక పాటను నంది అవార్డు గ్రహీత మాళవిక ఆలపించారు. ఈ చిత్రానికి సంబందించిన పాటలను ఒక ప్రముఖ హీరో విడుదల చేయనున్నారు. అలాగే చిత్రానికి సంబందించిన ప్రచార చిత్రాలను కూడా ప్రముఖుల చే వైజాగ్ లో విడుదల చేయనున్నారు.
18 నిముషాల నిడివి గల ఈ ఇండిపెండెంట్ చిత్ర షూటింగ్ ను కేవలం రెండు రోజులలోనే ముగించడం విశేషం. సాదారణంగా చలన చిత్రాలకు పని చేసే అగ్ర తారలు, సాంకేతిక నిపుణులు కేవలం కథ కు ప్రాదాన్యం ఇచ్చి ఈ ఇండిపెండెంట్ చిత్రానికి పని చేయడానికి ఒప్పుకోవడం అభినంచదగ్గ విషయం. ఈ చిత్రం సాంకేతికత పరంగా పెద్ద చిత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండబోతున్నది అని చెప్పుకోవడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
“మనకు సీతా దేవి అంటే కేవలం రాముడి భార్య గా, అయోధ్య నగర పట్టపురాణి గా మాత్రమే తెలుసు కానీ సీత లో ని మరో కోణాన్ని[ది అదర్ సైడ్ ఆఫ్ సీత] ప్రేక్షకులకు పరిచయం చేయడమే” ఈ చిత్ర ఉద్దేశ్యం.
Share This:
-
Prevoius
-
NextYou are viewing Last Post
good job sree ram,..!!
ReplyDeletethank you :)
ReplyDeleteGood start ... All the best
ReplyDeletethanks a lot Vikram garu.
ReplyDelete