Latest News

Menu

విడుదలైన 'పనిలేని పులిరాజు' ఫస్ట్ లుక్

ధన రాజ్ హీరోగా ఐదుగురు హీరోయిన్స్ తో పాలెపు మీడియా ప్రై.లి బ్యానర్ పై  పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'. ఈ చిత్రానికి చాచా దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న చిత్రం సెప్టెంబర్ మొదటి వారం లో ఆడియో రిలీజ్ చేసుకొని అక్టోబర్ లో విడుదల కానుంది. ఇటివలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా  లో విడుదల చేసారు చిత్ర యూనిట్. 


ఈ సందర్భంగా నిర్మాత సహా నిర్మాత రవి కె.పున్నం మాట్లాడుతూ "ధన్ రాజ్ మొట్ట మొదటి సారిగా సోలో హీరో గా నటించిన చిత్రమిది. డైలాగ్ కామెడి తో కూడిన ఈ చిత్రం  ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది." అన్నారు. 
ఈ సందర్భంగా నిర్మాత నగేష్ కుమార్  మాట్లాడుతూ" సినిమా మేం అనుకున్న దానికన్నా చాలా రెట్లు బాగా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ 'లేడీస్ టైలర్' చిత్రాన్ని తలపించే విధంగా ఈ సినిమా రూపొందించాం. ప్రతి సీన్ పంచ్ లతో నిండి ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని మా గట్టి నమ్మకం" అన్నారు.   
చిత్ర దర్శకుడు చాచా మాట్లాడుతూ" కామెడీ తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి సీన్ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రం అనుకున్న దానికంటే బాగా రావాడానికి కారణమైనా మా టీం అందరికి నా ధన్యవాదాలు" అన్నారు.

Share This:

Post Tags:

RAYARAO SRIRAM

I'm Rayarao Sriram. I am a Movie Buff and working as Freelance Feature Writer and Film Review. I love to stay honest and unique. I love Cinema and I respect Film Makers. Follow me to get updates on the latest happenings in film industry and for the latest and genuine faster updates!

No Comment to " విడుదలైన 'పనిలేని పులిరాజు' ఫస్ట్ లుక్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM