ఉత్తర సినిమాకు పాజిటీవ్ వైబ్రేషన్స్, జనవరి 3న ఉత్తర విడుదల !!!
రవికుమార్ మాదరవు సమర్పణలో ఎస్ఆర్ తిరుపతి దర్శకత్వంలో శ్రీరామ్, కారుణ్య కాథరిన్ హీరో హీరోయిన్లుగా ఉత్తర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమాలో టిల్లు వేణు, అభయ్ ల కామెడీ హైలెట్ గా నిలుస్తుంది. చివరి 30 నిమిషాలు చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, తల తిప్పుకోలేనంత సస్పెన్స్ ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, ముఖ్యంగా సెకండ్ హాఫ్ చూసి ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు, తరువాత ఏం జరుగుతుందోనన్న సస్పెన్స్ సినిమాలో ఆడియన్స్ ను కట్టిపడేస్తుందని టాక్.
లైవ్ ఇన్ సి క్రియేషన్స్ , గంగోత్రి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ఆర్ తిరుపతి, శ్రీపతి గంగాదాస్ సంయుక్తంగా ఈ సినిమా విడుదలకు ముందే పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది.
No Comment to " ఉత్తర సినిమాకు పాజిటీవ్ వైబ్రేషన్స్, జనవరి 3న ఉత్తర విడుదల !!! "