Latest News

Menu

తెలంగాణకు జలసిరులు.. మేఘా కృషీవలురు

దేనికోసమైతే తెలంగాణ కొట్లాడిందో ఇప్పుడు అదే పాదాక్రాంతమైంది. జలం కోసం రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ యుద్ధాలు చేసిందో ఆ జలమే తెలంగాణ బీడు భూములను తడిపి పంటలు పండిస్తున్నాయి. తెలంగాణ రైతాంగాన్ని గోదావరి జలాలు పునీతం చేస్తున్నాయి. అపర భగీరథుడిగా కేసీఆర్ సంకల్పానికి.. మేఘా ఇంజినీరింగ్ సంస్థ పట్టుదల వెరిసి తెలంగాణలో జలసిరులు ఉబికివస్తున్నాయి. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నాయి. కేసీఆర్ సంకల్పించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన కలలను నెరవేరుస్తోంది ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ (ఎంఈఐఎల్). పట్టువదలని విక్రమార్కుడి వలే తెలంగాణకు నీటి సరఫరాలో భగీరథుడిలా పరుగులు తీస్తోంది. ఈ కంపెనీ రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి ఔరా అనిపించింది. కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేఘ ఇంజనీరింగ్ ఇంఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 3763  మెగావాట్ల  పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది.


చిరుతను మించిన వేగం.. ‘మేఘా’ సొంతం
ఉమ్మడి ఏపీలో నీటి ప్రాజెక్టులు కట్టాలంటే దశబ్దాలు పడుతాయన్న అపఖ్యాతి ఉండేది. కానీ ఇప్పుడు వాటన్నింటిని పటాపంచలు చేస్తూ మేఘా కంపెనీ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం ఇంజినీరింగ్ చరిత్రలోనే ఓ అద్భుతమనే చెప్పాలి.  ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకంలో అత్యధిక పంపింగ్‌ కేంద్రాలను ఎంఈఐఎల్‌ పూర్తిచేసి తన ఇంజనీరింగ్‌ శక్తిసామర్థ్యాలు, నైపుణాన్ని చాటుకుంది. మొత్తం 22 పంపింగ్ కేంద్రాల్లో 96 మెషిన్లు(ఒక పంపు, ఒక మోటారును కలిపితే మిషన్ అవుతుంది) 4680 సామర్థ్యంతో  నిర్మిస్తుండగా అందులో 15కేంద్రాల్లో 89మెషిన్లను 3840 సామర్థ్యంతో నిర్మిస్తోంది. కేవలం నాలుగేళ్ళ సమయంలో దాదాపు నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్‌హౌస్‌లను నిర్మించడమే కాకుండా వాటిని పంపింగ్‌ ద్వారా వినియోగంలోకి(ఆపరేషన్‌, మెయిన్‌టెనెన్స్‌) తీసుకొచ్చి మేఘా మరో ఘనతను సాధించింది.

మూడేళ్లలోనే ఫలితం చూపించిన మేఘా
ప్రపంచంలో తొలిసారిగా కాళేశ్వరం వద్ద భారీస్థాయిలో బహుళ ఎత్తిపోతల పథకం   నాలుగేళ్ళ క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. పనులు ప్రారంభించిన మూడేళ్ళలోనే లింక్‌-1, లింక్‌-2లో ఎత్తిపోతల కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి.  కేవలం నాలుగేళ్లలో ప్రపంచంలోని అతి భారీనీటి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలకుతోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రోమెకానికల్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైలం, ఏబిబి, క్రాంప్టన్‌ గ్రేవ్స్‌, వెగ్‌ లాంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకున్నాయి.

ప్రపంచంలోనే అద్భుతాన్ని ఆవిష్కరించిన ‘మేఘా’
మేఘా సంస్థ పనితనానికి కాళేశ్వరం కంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదంటారు. ఇంజనీరింగ్‌ నిపుణులు సైతం నివ్వేరపోయేలా రికార్డు సమయంలో పనులు పూర్తయ్యాయి. ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడా ఇంత తక్కువ సమయంలో ప్రాజెక్ట్‌ పూర్తయ్యింది లేదు. తాజాగా ప్యాకేజ్‌-14లోని పంప్‌హౌస్‌ను వినియోగంలోకి తేవడం ద్వారా 3,763మెగావాట్ల  పంపింగ్‌ సామర్థ్యం వినియోగంలోకి రానుంది. నీటి పారుదల రంగంలో దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్‌ చేసేలా భారీ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంది. సాగునీటి అవసరాల కోసం ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉంది. ఆ తర్వాత లిబియాలోని  గ్రేట్‌ మ్యాన్‌మేడ్‌ రివర్‌ రూపుదిద్దుకుంది. వీటన్నింటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం పెదద్దికాగా ఆ పథకంతో పోలికలేని స్థాయిలో భారీ బహుళ తాగు, సాగు నీటి పథకంగా కాళేశ్వరం ప్రపంచ ప్రసిద్ధి చెందింది.

భూగర్భాన్ని చీల్చి నీటిని ఎత్తిపోసి..
ఎలాంటి భూసేకరణ.. అపారమైన భూములు అవసరం లేకుండా మేఘా భూగర్భాన్ని చీల్చి.. పంప్ హౌస్ లు, సర్జిపూల్స్ కట్టి నీటిని ఎత్తిపోసిన తీరు నభూతో నభవిష్యతి అని చెప్పక తప్పదు. మేఘా ఇంజనీరింగ్‌ నిర్మించిన గాయత్రి (ప్యాకేజ్‌-8), అన్నపూర్ణ (ప్యాకేజ్‌-10), రంగనాయక సాగర్‌ (ప్యాకేజ్‌-11), మల్లన్నసాగర్ (ప్యాకేజ్‌-12) భూగర్భంలో నిర్మించినవే. ప్రధానంగా గాయత్రి పంప్‌హౌస్‌ నిర్మాణం కోసం భూగర్భంలో 2.3ఘనపు మీటర్ల మట్టిని తొలిసి బయటకు తీసింది. ఈ పంపింగ్‌ కేంద్రం వైశాల్యం 84753.2 చదరపు అడుగులు. దీనికి సంబంధించిన సర్జ్‌పూల్‌, అదనపు సర్జ్‌పూల్స్‌ కూడా ప్రపంచంలోనే పెద్దవి. లింక్‌-1లో ప్రాణహిత జలాలను గోదావరిలోకి అంటే శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి జలాశయంలోకి తీసుకురావడం. గోదావరిని దిగువ నుంచి ఎగువకు తిరుగు ప్రయాణం చేసే విధంగా పంపింగ్‌ చేయడం కోసం 1120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంప్‌హౌస్‌లను 28మిషన్‌లతో ఏర్పాటు చేశారు. అవి లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్‌ కేంద్రాలు. వీటిన్నింటిని భూగర్భంలో నిర్మించి సరికొత్త ఆ ప్రాంతంలో సరికొత్త లోకాన్ని సృష్టించింది.

భారీ విద్యుత్ వ్యవస్థతో మేఘా సత్తా
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అతిపెద్ద విద్యుత్‌ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం 4680 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉండగా, ఇందులో అత్యధికంగా 3840 మెగావాట్ల విద్యుత్‌ వ్యవస్థను ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసింది. మొత్తం ఏడు ఈశాన్య రాష్ట్రాల విద్యుత్‌ సరఫరా సామర్థ్యం (3916 మెగావాట్లు), కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంఈఐఎల్‌ ఏర్పాటు చేసిన విద్యుత్‌ వ్యవస్థకు దాదాపు సమానం కావడం మేఘా సంస్థ సత్తాకు నిదర్శనంగా మారింది.  

మేఘాతో తెలంగాణ సస్యశ్యామలం..
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనా.. ప్యాకేజీలతో తెలంగాణ మొత్తం కవరయ్యేలా మేఘా సంస్థ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా ప్రపంచవింతల్లో ఒకటిగా సాగునీటి రంగ నిపుణులు అబివర్ణిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్‌ అదృష్టమని మేఘా సంస్థ ప్రతినిధి బీ.శ్రీనివారెడ్డి కూడా తాజాగా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చి మేఘా సంస్థ చరిత్రలో నిలిచింది. ఆ సంస్థకు తెలంగాణ ప్రజలంతా రుణపడేలా చేసింది. కేసీఆర్ సంకల్పం.. మేఘా కృషికి తెలంగాణ సస్యశ్యామలమైంది. దేశానికే అన్నం పెట్టేలా తెలంగాణను ధాన్యాగారంగా మలచడంలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంకల్పం.. మేఘా సంస్థ పనితనం వెరిసి తెలంగాణ సాగునీటి రంగమే సమూలంగా మారిపోయిన వైనం మన కల్లముందే కనిపిస్తోంది.

Share This:

RAYARAO SRIRAM

I'm Rayarao Sriram. I am a Movie Buff and working as Freelance Feature Writer and Film Review. I love to stay honest and unique. I love Cinema and I respect Film Makers. Follow me to get updates on the latest happenings in film industry and for the latest and genuine faster updates!

No Comment to " తెలంగాణకు జలసిరులు.. మేఘా కృషీవలురు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM