Latest News

Menu

కరోనా రక్కసి విలయ తాండవం చేస్తున్న వేళా కూడా పోలవరం పనులు ఆగటం లేదు.

అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ పోలవరం లో పనులన్నీ కీలకదశకు చేరుకున్నాయి. ప్రపంచంలోనే భారీ స్పిల్‌వే నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లోని ప్రధానమైన పనులు కరోనా వున్నా కూడా నిర్మాణం ఆగటం లేదు. ముఖ్యంగా స్పిల్‌వే, స్పిల్ ఛానెల్, అప్రోచ్ చానెల్, పైలెట్ ఛాన్లెతో పాటు ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాంతో సహా 1,2,3 (గ్యాప్‌లు) ప్రాంతాలతో పాటు గతంలో పూర్తిగా నిలిచిపోయిన జల విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులు సైతం మొదలయ్యాయి.
అప్పట్లో చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌ను 2018లో పూర్తిచేస్తామని పదే పదే ప్రకటించినప్పటికీ నిర్మాణ పనులు నత్తనడకన నడిచాయి. అప్పట్లో స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులు కొంత మేరకు జరగడం మినహా మిగిలిన పనులేవి ప్రారంభించనేలేదు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వం చేపట్టిన పనులను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవడం ద్వారా ప్రభుత్వానికి వ్యయం తగ్గించడంతో పాటు (ప్రభుత్వానికి ఆదా) అన్ని పనులు ముమ్మరం అయ్యే విధంగా చర్యలు చేపట్టారు.


ప్రాజెక్ట్ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ లక్ష్యం మేరకు పనులను ప్రణాళికబద్ధంగా సాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో 50 లక్షల వరద నీరు ప్రవహించే విధంగా స్పిల్‌వే నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా పరిగణించే చైనాలోని త్రిగాడ్జేస్ జలాశయ స్పిల్‌వే వరద నీటి విడుదల సామర్థ్యం 47 లక్షల క్యూసెక్కులు. దానికన్నా పోలవరం ప్రాజెక్ట్ 3 లక్షల క్యూసెక్కుల అధిక సామర్థ్యంతో మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. 2019 నవంబర్‌లో మేఘా పనులను ప్రారంభించగా అప్పటికే జలాశయ నిర్మాణ ప్రాంతంలో ముందు, వెనకా వరద నీరు చేరడం వల్ల (గత ప్రభుత్వం ఇంజనీరింగ్ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల ) దాదాపు 4 టిఎంసీల నీటిని ఎత్తిపోయడానికే అధిక సమయం పట్టింది. ఆ తరువాత జనవరిలో పనులు వేగవంతం చేయడం సాధ్యమైంది. నిర్మాణ పనులకు వేసవి కాలం ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు కీలకమైనవి కాగా కరోనా కష్టాలతో దేశ వ్యాప్తంగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మందగించాయి. పోలవరం నిర్మాణంపై కూడా ఈ ప్రభావం పడిరది.

సమస్యలెదురైనా సరే..
రెండు వేలమందికి పైగా కార్మికులు బీహార్, రaార్ఖండ్, ఒరిస్సా వంటి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. నామమాత్ర కార్మికులు, సిబ్బందితోనే పనులు చేయించాల్సి వచ్చింది. అయినప్పటికీ పనులు ఆగిపోకుండా ముందుకు సాగించడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మేఘా ఇంజనీరింగ్ సమర్థంగా వ్యవహరించాయి. పనులుల్లో స్పిల్‌వే, స్పిల్ ఛానెల్, జల విద్యుత్ కేంద్రం, మట్టి, రాతి పనులు ఈ కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరిగాయి. నవంబర్-డిసెంబర్ నెలలో నీటి సమస్య వల్ల మందకోడిగా జరిగాయి. నవంబర్‌లో 206, డిసెంబర్లో 5628 ఘనపు మీటర్ల పనులు జరిగాయి. జనవరి నుంచి పనులు ఊపందుకున్నాయి. 20639 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32443, మార్చిలో 36129 ఘనపు మీటర్ల స్పిల్‌వే, స్పిల్ ఛానెల్ కాంక్రీట్ పనులు జరిగాయి. ఏప్రిల్, మే నెలలో కరోనా ప్రభావం పోలవరంపై పడకుండా అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించాయి.

ముడి సరుకు ముఖ్యంగా సిమెంట్, స్టీల్ ఇతర వస్తువుల సరఫరాపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. రవాణా వ్యవస్థ ఏప్రిల్, మే నెలల్లో స్తంభించిపోవడం వల్ల అవసరమైన ముడిసరుకు ప్రాజెక్ట్‌కు చేరకపోవడంతో అనేక అవరోధాలు ఎదురయ్యాయి. పనులు అనుకున్న స్థాయిలో చేయలేకపోయారు. ప్రభుత్వ యంత్రాంగం, కంపెనీ సిబ్బంది దానిని అధిగమించడానికి శతవిధాల ప్రయత్నించాల్సి వచ్చింది. అదే సమయంలో కార్మికులు కోసం జిల్లా వైద్య సిబ్బంది, మేఘా సంస్థ ప్రత్యేకంగా వైద్యసిబ్బందితో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసింది. అలాగే వారికి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం అందచేశారు. ఈ మెడికల్ క్యాంపులో నిత్యం అన్నిరకాల వైద్య పరీక్షులు చేస్తున్నారు. ఈ కరోనా కాలంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు.

జగన్ హయాంలోనే స్పిల్ ఛానల్ పనులు – శ్రమించిన ఇంజనీర్లు, మేఘా సిబ్బంది
నాటి ప్రభుత్వంలో స్పిల్ ఛానల్ పనులు అస్సలు జరగలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పనిని ప్రారంభించింది. ఏప్రిల్‌లో స్పిల్‌వే కాంక్రీట్ పని 18714 ఘ.మీ, స్పిల్ ఛానెల్ 9511 ఘ.మీ కాంక్రీట్ పని జరిగింది. మొత్తం మీద 28225 ఘ.మీ కాంక్రీట్ పనిని పూర్తిచేశారు. మే నెలలో అంతకన్నా దాదాపు రెట్టింపు పని జరిగింది. స్పిల్ వే 10909, స్పిల్ ఛానెల్ 42354 ఘ.మీ చొప్పున జరిగాయి. మొత్తం మీద 53263 ఘనపు మీటర్ల పనిని మే నెలలో చేశారు. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించినప్పటి నుంచి అంతకు ముందు ఏ నెలలోనూ చేయనంతగా మే నెలలో కరోనాని సైతం ఎదుర్కొని ఆ మేరకు పనిచేశారంటే ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. నవంబర్ నుంచి ఇప్పటివరకు (జూన్ 8, 2020) 2,01,025 ఘ.నపు మీటర్ల స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులు జరిగాయి.

కోవిడ్ సమస్య కారణంగా కార్మికులు దాదాపుగా వెళ్లిపోయినప్పటికీ స్పిల్‌వేలో మే నెలలో దాదాపు రోజుకు 3000 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తిచేశారు. ఇదే నెలలో ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 1681 మంది ఇందులో కాంట్రాక్ట్ లేబర్, కింది స్థాయి సిబ్బంది, ఇంజనీర్లు కలుపుకొని 1681 మంది మాత్రమే పనులు పర్యవేక్షించారు. స్పిల్ వేలో 232 మంది కాంట్రాక్ట్ లేబర్, 200 మంది మేఘా సంస్థ సిబ్బంది అనునిత్యం పనిచేయడం ద్వారా ఇది సాధ్యమైంది. అదే విధంగా స్పిల్ ఛానెల్ లో 310 మంది కంపెనీ సిబ్బంది, కాంట్రాక్ట్ లేబర్లు పనులు చేశారు. వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలించడం కోసం ప్రభుత్వం, మేఘా ప్రత్యేకంగా రవాణా సదుపాయాలను ఏర్పాటు చేసింది.

మట్టి తవ్వకం, బండరాళ్లు తొలగించడం, మట్టికట్ట నిర్మాణం, జల విద్యుత్ కేంద్రం పనులు, ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం పనులు ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైనవి. గతంలో ఈ పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ప్రాజెక్ట్‌లో స్పిల్‌వే కాంక్రీట్, లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణ పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాజెక్ట్‌లో అన్ని పనులు సకాలంలో పూర్తయితేనే ప్రాజెక్ట్ ప్రయోజనం నెరవేరుతుంది. కానీ అప్పట్లో అప్పర్ కాఫర్ డ్యాంను మాత్రమే నిర్మించి 2018లో నీటిని నిల్వ చేయడం ద్వారా ప్రాజెక్ట్‌ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. ఇలా చేయడం ప్రాజెక్ట్ నిర్మాణంలో నియమ నిబంధనులకు (ఇంజనీరింగ్ ప్రోసిజర్స్) విరుద్ధం. అయితే అప్పట్లో ఆ పనిని కూడా పూర్తిచేయలేకపోయారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పిల్ వే కాంక్రీట్ పనులు కొనసాగించడంతో పాటు ప్రధానమైన ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం (3 గ్యాపులు) నిర్మించడానికి అవసరమైన మట్టి పటుత్వ పరీక్షలు (వైబ్రో కంప్యాక్షన్ పనులు) మేఘా ఇంజనీరింగ్ చేపట్టింది. అలాగే స్పిల్ ఛానెల్ పనులు మొదలయ్యాయి. ఇందులో ప్రధానంగా మట్టి తవ్వకం ఊపందుకుంది. స్పిల్ ఛానెల్‌కు సంబంధించిన కాంక్రీట్ బ్లాక్ నిర్మాణం కూడా క్రియాశీల దశకు చేరుకుంది. ఫిబ్రవరిలో ఈ పనులును మేఘా ఇంజనీరింగ్ ప్రారంభించగా ప్రతినెలా పని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఇప్పటికీ (జూన్ 08,2020) 2,01,025 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తిచేసింది. పవర్ హౌస్ నిర్మాణ పనులు గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిలిచిపోయాయి. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించాలి. ఇందుకోసం ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 వర్టికల్ కప్లాంగ్ టర్బైన్లను ఏర్పాటు చేయాలి. కానీ ఈ పని చంద్రబాబు ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్) పనులు ఊపందుకున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌లో గ్యాప్-1, ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం (గ్యాప్-2) మట్టి పటుత్వ పరీక్షలు, సాండ్ ఫిల్లింగ్, గ్యాప్-3 పనులతో పాటు కాఫర్ డ్యాం పని కూడా వేగంగా జరుగుతోంది. గ్యాప్-2లో 22 లక్షల ఘనపు మీటర్ల మట్టి పని, సాండ్ ఫిల్లింగ్ 10 లక్షల ఘనపు మీటర్ల మేర చేయాలి. స్పిల్ ఛానెల్లో దాదాపు 42 లక్షల ఘనపు మీటర్లు, 17 లక్షల ఘనపు మీటర్లకు పైగా బండరాళ్లు తవ్వాలి. ఈ పనులు ఇప్పటిదాక వరుసగా 8,96,416, సాండ్ ఫిల్లింగ్ 2,78,000, పవర్ హౌస్ 2,16,265, కొండ తవ్వకం (బ్లాస్టింగ్) 64,816 ఘనపు మీటర్ల మేరకు జరిగాయి.

మేఘా నమ్మకంతో తిరిగివస్తున్న కార్మికులు
ప్రభుత్వం, మేఘా సంస్థపై నమ్మకంతో పోలవరంలో పనిచేసి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి వస్తూ పనుల్లో చేరుతున్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్న మేఘా సంస్థ దాదాపు 2000 మంది కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తిరిగి వెనక్కు తీసుకొచ్చింది. ఇలా వచ్చినవారికి ప్రత్యేక ఇన్సెంటివిఎస్ తో పాటు ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. అలాగే ప్రత్యేక మెడికల్ టీం ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తరువాతనే పనుల్లోకి అనుమతిస్తున్నారు. ఇప్పటిదాకా 1800 మంది తిరిగి వచ్చారు. పనిచేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పనులను మరింత వేగవంతం చేయనున్నారు. ఏదేమైనా తిరిగి వచ్చే కార్మికుల సహకారంతో అనుకున్న పనులను పూర్తి చేసి వర్షాకాలం మొదలై వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా పనులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది మేఘా సంస్థ.

Share This:

Post Tags:

RAYARAO SRIRAM

I'm Rayarao Sriram. I am a Movie Buff and working as Freelance Feature Writer and Film Review. I love to stay honest and unique. I love Cinema and I respect Film Makers. Follow me to get updates on the latest happenings in film industry and for the latest and genuine faster updates!

No Comment to " కరోనా రక్కసి విలయ తాండవం చేస్తున్న వేళా కూడా పోలవరం పనులు ఆగటం లేదు. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM