Latest News

Menu

సరిహద్దుల్లో సాహసం.. ప్రతిష్టాత్మకమైన జోజిల్లా పాస్ రోడ్ టన్నెల్ పని దక్కించుకున్న మేఘా

రక్షణలో కీలకమైన ప్రాజెక్టు మేఘా చేతికి చిక్కంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జోజిల్లా పాస్ టెన్నల్ ప్రాజెక్టు పనులను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ ( ఎంఈఐఎల్) దక్కించుకుంది. హిమాలయాల్లోని జమ్ము కాశ్మీర్-లడఖ్ లో అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న నిర్మించనున్న జోజిల్లా పాస్ టన్నెల్ పనులకు సంబంధించిన టెండర్ అతి తక్కువ ధరకు ఎంఈఐఎల్ కోట్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జాతీయ రహదారులు, ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ హెచ్ఐడీసీఎల్(NHIDCL) ఫైనాన్స్ బిడ్లను తెరవగా అతితక్కువ కోట్ చేసి ఎంఈఐఎల్ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది.

* క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాణానికి సిద్ధం..

ఇందులో భాగంగా మొత్తంగా దాదాపు 33కిలోమీటర్ల మేర రెండు విభాగాలుగా రోడ్డ పనులు చేపట్టాల్సి ఉంటుంది. మొదటి విభాగంలో 18.50కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేసి నిర్మించాలి. ఇందులో రెండు టన్నెల్స్ ఉన్నాయి. మొదటిది రెండు కి.మీ. మరియు రెండవది 0.5 కి.మీ. ఇక రెండవ విభాగంలో జోజిల్లా టన్నెల్ ను 14.15 కిలోమీటర్ల మేర రెండు రహదారుల లైన్ గా 9.5మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు పద్ధతిలో గుర్రపు నాడా(Horse shoe shape) ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుంది.


*అత్యంత తక్కువ ధరకు కోట్..

సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఈ రోడ్ టన్నెల్ కు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకుల టెండర్లను పిలిచింది. ఇందులో జోజిల్లా టన్నెల్ కు సంబంధించి 14.15కిలోమీటర్ల రహదారిని నిర్మించేందుకు, ఇతర రోడ్ పనులకుగాను వేరే సంస్థలు అధిక ధరలకు కోట్ చేశాయి. అయితే ఎంఈఐఎల్ 4509.50 కోట్ల రూపాయలకు పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. మిగిలిన రెండు కంపెనీలతో పోలిస్తే ఎంఈఐఎల్ అతి తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా ఎల్-1 ముందంజలో నిలిచింది. గతనెల 30వ తేదిన NHIDCL మూడు సంస్థలు బిడ్ లు సమర్పించగా ఆగస్టు 21 న ఫైనాన్స్ బిడ్లు తెరిచారు.


*సవాల్ కు సిద్ధమైన మేఘా..

దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను పూర్తి చేసిన మేఘా(ఎంఈఐఎల్) కు ఉంది. ఎన్నో క్లిషపరిస్థితులను ఎదుర్కొంటూ సమయానికి పనులు పూర్తి చేయడంలో మేఘా ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా మరో సవాల్ కు సిద్ధమవుతుంది. జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండవు. హిమాలయాల్లో ముఖ్యంగా శీతాకాలంతో పాటు మొత్తం ఆరు నెలలపాటు శ్రీనగర్-లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీకి సంబంధించిన వాహనాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృథా అవుతోంది. ఈ పరిస్థితుల్లో సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్ కు రహదారి టన్నెల్ నిర్మించాలని ఎప్పుడో ప్రతిపాదించారు. అయితే అది ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది.


* ఎతైన ప్రాంతంలో పనులు సులభం కాదు..

జాతీయ రహదారి-1లోని జడ్-మోర్హ (Z-Morh) టన్నెల్ నుంచి జోజిల్లా టన్నెల్ వరకు కనెక్టింగ్ టన్నెల్ ను జోజిల్లా పాస్ ప్రాంతంలో సోనామార్గ్- కార్గిల్ మధ్య ఎంఈఐఎల్ నిర్మించనుంది. ఈపీసీ పద్ధతిలో చేపడుతున్నప్పటికీ ఈ పని అత్యంత క్లిష్టమైనది. ప్రపంచంలో ఇంతవరకు ఏ రహదారి టన్నెల్ నిర్మాణంలో ఎదురుకాని అవాంతరాలు ఈ టన్నెల్ నిర్మాణంలో ఎదురుకానున్నాయి. సరాసరిన భూ ఉపరితలం నుంచి 700మీటర్ల దిగువన టన్నెల్ ను నిర్మించాల్సి ఉంటుంది. పూర్తిగా క్లిష్టమైన కొండప్రాంతం(complicated hilly terrain)  తోపాటు మంచు తుఫాన్ లు తరచూ సంభవిస్తుంటాయి. దట్టమైన మంచు సంవత్సరంలో 8నెలలపాటు ఉండడం వల్ల పనులు చేయడం అంత సులభం కాదని తెలుస్తోంది. అదే సమయంలో పక్కనే నది కూడా ప్రవహిస్తుంది. దీనివల్ల నిర్మాణ సమయంలో నీరు, మంచు ప్రవేశించి తీవ్ర సమస్యలు ఎదురవుతాయని నిపుణులు భావిస్తున్నారు.


* సరిహద్దుల్లో రవాణా మెరుగు..

సరిహద్దు రహదారులు సంస్థ  జమ్ము కాశ్మీర్- లడఖ్ మధ్య అన్ని వర్గాల వారికి రహదారి ప్రయాణ సౌకర్యాలు మెరుగు పరచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే హైవే టన్నెల్ ను శ్రీ నగర్ నుంచి బల్తల్ వరకు కూడా నిర్మించాలి. అమరనాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కూడా ఈ టన్నెల్ రహదారి వాడవచ్చు. ఈ యాత్రకు వెళ్లే వారికి కార్గిల్ సమీపంలోని బల్తల్ బేస్ క్యాంప్ గా ఉంది.


* క్లిష్ట పరిస్థితుల్లో 72నెలలపాటు పనులు..

సింగిల్ ట్యూబ్ టన్నెల్ గా పిలిచే ఈ జోజిల్ల రహదారిలో రెండు వైపులా ప్రయాణించే (బై డైరెక్షనల్ ట్రాఫిక్) రెండు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ సీహెచ్. సుబ్బయ్య తెలిపారు. ఈ రహదారిలో ప్రధానంగా  శాప్ట్స్ తో పాటు పోర్టల్ స్ర్టక్చర్స్, తవ్విన మట్టిరాయి (మక్కు) డిసోపోసబుల్ ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇంతటి క్లిష్టమైన ప్రాజెక్ట్ ను 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం పనిని ప్రధానంగా రెండు భాగాలుగా చేయాల్సి ఉంటుంది.


దీనిలో మొదటి భాగం రహదారి 18.50కిలోమీటర్లు, రెండవ భాగం టన్నెల్ గా 14.15 కిలోమీటర్లు. మొదటి భాగం జడ్ -మోర్హ నుంచి నుంచి జోజిల్లా టన్నెల్ వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని 3.018 కిలోమీటర్లు విస్తరించి అభివృద్ధి చేయాలి. కొత్తరహదారి 13.842 కిలోమీటర్లు నిర్మించాలి. ఇందులోనే ట్విన్ టూర్ టన్నెల్స్ ఒకటి 2.36 కిలోమీటర్లు, రెండవది 2.39కిలోమీటర్లు నిర్మించాలి. ఇందులో 5 బ్రిడ్జ్ లు ఉంటాయి. ఒక్కొక్కటి 300 మీటర్లు, 150 మీటర్ల చొప్పున రెండు స్నో గ్యాలరీలను నిర్మించాలి. ఈ పనులన్నీ మొత్తం 18.475 కిలోమీటర్లు. అదే విధంగా పార్ట్-2లోని జోజిల్లా టన్నెల్ నిర్మించాలి. ఇందులో టన్నెల్ కు సంబంధించి పైన పేర్కొన్న వివారాలతో పాటు 0.16 కిలోమీటర్ల పొడవున కట్ అండ్ కవర్ టన్నెల్ ఉంటుంది. వెంటిలేషన్ క్యావరిన్, శాఫ్ట్ల్ లు 3 నిర్మిస్తారు. లాంగ్ ట్యూడనల్ వెంటిలెషన్ సిస్టంగా పిలిచే శాఫ్ట్ లు రెండింటిని నిర్మిస్తారు.


*దేశ రక్షణలో ‘మేఘా’ సైతం..

దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టలేదని తెలుస్తోంది. తొలిసారి మేఘా ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఈ పనులు చేపడుతోంది. దీనిలో ప్రత్యేకంగా ట్రాన్స్ పోర్టు వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. వీటికి అదనంగా రిటైనింగ్ గోడలు, బ్రిస్ట్ గోడలు, గేబియన్ నిర్మాణాలు, మట్టితో నిర్మించే గోడలు మొత్తం దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఎంఈఐఎల్ నిర్మించాల్సి ఉంటుందని సుబ్బయ్య తెలిపారు. మంచుతుఫాన్లు తలెత్తితే ఎటువంటి ప్రమాదం లేకుండా క్యాచ్ డ్యామ్స్, ఎయిర్ బ్లాస్ట్, ప్రొటెక్షన్ గోడలు, డిఫ్లెక్టర్ డ్యామ్స్ దాదాపు 6 కిలోమీటర్ల మేర నిర్మిస్తారు. మొత్తంమీద మేఘా సంస్థ దేశ రక్షణకు ఎదరవుతున్న మరో సవాల్ ను పూర్తి చేయడానికి సిద్ధమవుతుండటం విశేషం.

Share This:

Post Tags:

RAYARAO SRIRAM

I'm Rayarao Sriram. I am a Movie Buff and working as Freelance Feature Writer and Film Review. I love to stay honest and unique. I love Cinema and I respect Film Makers. Follow me to get updates on the latest happenings in film industry and for the latest and genuine faster updates!

No Comment to " సరిహద్దుల్లో సాహసం.. ప్రతిష్టాత్మకమైన జోజిల్లా పాస్ రోడ్ టన్నెల్ పని దక్కించుకున్న మేఘా "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM